![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -134 లో..... కేశవ డల్ గా ఉంటాడు. ఏమైందని చక్రి అడుగుతాడు. దాంతో శైలు పట్ల తను బెహేవ్ చేసిన తీరు గురించి చెప్తాడు. నువ్వు కిడ్నాప్ అయిన రోజున నిన్ను వెతకడానికి వెళ్తుంటే ఊరికే ఫోన్ చేసి విసిగించింది.. అందుకే కొట్టానని కేశవ అంటాడు. ఒరేయ్ ఆ అమ్మాయి నువ్వు అంత చిరాకు పడ్డా వస్తుందంటే అర్థం చేసుకో.. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది.. ప్రేమించిన వాడిగా చెప్తున్నానని చక్రి అంటాడు. నీది వన్ సైడ్ లవ్ అంతే అని కేశవ అంటాడు. లవ్ అయితే ఉంది కదా అని చక్రి అంటాడు. వాళ్ళ మాటలు వింటున్నట్లుగా మహా వెనకాల కన్పిస్తుంది.
ఆ తర్వాత ఉదయం కేశవ దగ్గరికి మహా వచ్చి.. రాత్రి మీ మాటలు విన్నానని మహా అంటుంది. నాకు చాల గిల్టీగా ఉంది.. ఆ అమ్మాయి ని కొట్టానని కేశవ అనగానే వెళ్లి తనకు సారీ చెప్పండి అని మహా చెప్తుంది. ఆ తర్వాత మహా ఆఫీస్ కి రెడీ అవుతుంది. నేను డ్రాప్ చేస్తానని చక్రి అంటుంటే వద్దు ముద్దపప్పులా ఉంటే ఏం తెలుస్తుంది.. స్వతంత్రంగా ఉంటేనే అన్నీ తెలుస్తాయి.. నేను వెళ్తానని మహా అంటుంది. అయినా నేను ఉన్నాను కదా అని కన్నా అంటాడు. కన్నా భుజం పై చెయ్ వేసి మహా వెళ్తుంటే కన్నాని చక్రి తిట్టుకుంటాడు. ఆ తర్వాత మహా ఆఫీస్ లో ఒక డిజైన్ వేస్తుంది. అది బాలేదని విక్కీ చెప్తాడు. సరే మళ్ళీ వేసుకొని వస్తానని మహా అంటుంది. ఆ తర్వాత మాధవ వాళ్ళు మహా కోసం ఒక వాష్ రూమ్ కట్టడానికి సిద్ధమవుతారు. అందుకోసం అక్కడ తవ్వుతారు. అప్పుడే నారాయణ వాళ్ళ అన్న రమణయ్య వచ్చి.. ఏంటి కోర్ట్ పర్మిషన్ తీసుకున్నారా అని కోప్పడతాడు. ఇల్లుకి ఏం రిపేర్ అయినా కోర్ట్ పర్మిషన్ తీసుకొని మొదలుపెట్టాలి లేదంటే కంప్లైంట్ ఇస్తానని రమణయ్య అంటుంటే మాధవ మాత్రం తనని రిక్వెస్ట్ చేస్తాడు.
నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లకపోతే గాయత్రి అత్తగారింటికి వెళ్లి అది పెళ్లి ముందురోజు లేచిపోయిందని చెప్తానని నారాయణ అనగానే అమ్మాయిని అడ్డం పెట్టుకుంటున్నావని రమణయ్య అంటాడు. మరి ఒక అమ్మాయి కోసం వాష్ రూమ్ కడుతుంటే ఎందుకు అడ్డుపడుతున్నావని నారాయణ అనగానే అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహా వస్తుంది. ఎందుకు ఇవన్నీ పనులు అని మహా అడుగుతుంది. నారాయణ ఆల్రెడీ చేతికి గాయం ఉంటుంది. ఇంకా నొప్పి వస్తుంది.. మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని నారాయణని మహా లోపలికి తీసుకొని వెళ్తుంది. ఒరేయ్ కన్నా నీ వల్లే మీ నాన్నకి గాయం అయింది.. వెళ్లి సారీ చెప్పమని కన్నాతో మహా అంటుంది. నేను చెప్పనని కన్నా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |